Pulipaka Venkateswara Prasad పోతన వ్రాసిన ఈ పద్యం మనలనే కాదు ఆయన తర్వాత వచ్చిన శ్రీకృష్ణ దేవరాయలును సైతం మంత్రముగ్ధుడిని చేసిందని చాల మందికి తెలియదు
ఆయన వ్రాసిన ఆముక్తమాల్యద లో దీని మొదటి రెండు పాదాలను అనుకరిస్తూ ఒక పద్యం చెప్పాడు.
ఎవ్వని చూడ్కి చేసి జనయించు జగంబు వసించు నిజ్జగం
వెవ్వనియందు, డిందు మరి యెవ్వని యందిది యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన ..............................,
పై పద్యం విష్ణుభక్తురాలు గోదాదేవి పలికింది. అందుచేత విష్ణువే పరమేశ్వరునిగా భావించింది.
భాగవతం లో గజేంద్రుడు పలికాడు. అతనికి ఈశ్వరతత్త్వం మాత్రమే తెలుసు. త్రిమూర్తుల భేదాభేదాలు తెలియదు. అది చెప్పటానికి పోతన ఆ తరువాత పద్యాలన్నిటిలో త్రిగుణాతీత మూర్తిగానే భగవంతున్ని గజేంద్రుడు అర్థిస్తాడు. దాదాపు 16, 17 పైగా సాగుతుంది గజేంద్రుని మొర. ఎక్కడా త్రిమూర్తులలో ఏ ఒక్కడిని ప్రార్థించినట్లుండదు.
మచ్చుకు రెండు పద్యాలు
స్త్రీ నపుంసక పురుష మూర్తియును కాక
తిర్య గమర నరాది మూర్తియును గాక
కర్మ గుణ భేద సదతత్ప్రకాశి గాక
వెనుక నన్నియు తా నగు విభు తలంతు
విశ్వకరు విశ్వదూరుని
విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు నవిశ్వున్
శాశ్వతు నజు బ్రహ్మప్రభు నీశ్వరునిం పరమపురుషు నే భజయింతున్Rishi Vasanth

No comments:
Post a Comment