Monday, September 8, 2014

తమ కార్యంబు పరిత్యజించియు పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్
    తమ కార్యంబు ఘటించుచున్ పరహితార్థ వ్యాపృతుల్ మధ్యముల్
    తమకై అన్యహితార్థ ఘాతుకజనుల్ దైత్యుల్, వృథాన్యార్థ భం
    గము గావించెడు వారలెవ్వరొ యెఱుంగన్ శక్యమే యేరికిన్ ?
 తమ కార్యముల విడిచి పరుల కార్యముల చేయువారు సత్పురుషులు.
 తమ కార్యమునకు భంగము లేకుండ పరుల కార్యముల నొనర్చువారు
 మధ్యములు. తమ కార్యము నిమిత్తమై పరుల కార్యమును చెడగొట్టువారు
 మనుష్యులలో రాక్షసులు. తమకు ప్రయోజనము ఏ మాత్రము లేకపోయినను
 పరులకు నష్టము చేయువారల కేపేరు పెట్టవచ్చునో నాకు తెలియుటలేదు.

No comments:

Post a Comment