గోధుమగడ్డి పౌడర్ తో 21 అత్యుత్తమ ప్రయోజనాలు
వీట్ గ్రాస్ అంటే సాధారణ గోధుమ మొక్క (ట్రీటికం ఈస్టివం). ఇది గోధుమల నుండి మొలకెత్తిఉంటుంది. ఇది ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తుంది, చికిత్స విలువలు ఉన్న ఆకు మొలక ఇది. దీనిలోని 19 అమినో ఆమ్లాలు, 92 ఖనిజాలు శరీరం అత్యుత్తమంగా పనిచేయడానికి దోహదం చేస్తాయి. సాధారణంగా బ్రెడ్ వీట్ గా పిలిచే దీనిని గ్రీన్ హౌస్ లేదా కృత్రిమ కాంతితో లోపలి ప్రదేశాలలో పండిస్తారు. ఆహారానికి ప్రత్యామ్నాయమైన వీట్ గ్రాస్ పొడి నిర్జలీకరణం చేసిన వీట్ గ్రాస్ రసం నుండి వస్తుంది. వీట్ గ్రాస్ పొడిని నిర్జలీకరణం చేయడానికి ముందు మూడు లేదా అంత కంటే ఎక్కువ నెలల క్రితం పొలాలలో సహజంగా పండిన గడ్డి నుండి తయారు చేస్తారు. ఈ పొడి లోని అనేక ఆరోగ్య ప్రయోజనాలకు ప్రాధమిక కారణం ఈ నిర్జలీకరణ ఉత్పత్తిలోని పోషకాల జాబితాతో బాటు దీనిలోని సాంద్రీకృత పత్రహరిత౦. గోధుమల్లా కాక, దీనిలో గ్లుటేన్ ఉండక పోవడం దీనిలోని ఉత్తమ లక్షణం. వీట్ గ్రాస్ పొడిని నీటిలో కలిపినప్పుడు ఇది ఒక పోషక పానీయంగా మారుతుంది లేదా దీనిని జ్యూసులు, స్మూతీలలో కలపవచ్చు. దీనిలో వీట్ గ్రాస్ మొక్కలో ఉండే అన్ని పోషకపదార్ధాలు, విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి.
వీట్ గ్రాస్ పొడి లోని ప్రయోజనాలు:
1. జీర్ణక్రియకు సాయం చేస్తుంది: సమస్యలు లేని జీర్ణక్రియకు వీట్ గ్రాస్ పొడి ఎంతో దోహదపడుతుంది. వీట్ గ్రాస్ పొడిలో ఉన్న కొన్ని ఆల్కలైన్ ఖనిజాలు అల్సర్లు, మలబద్దకం, డయేరియా ల నుండి ఉపశమనం కల్గిస్తాయి. ఎక్కువ మోతాదులో ఉన్న మెగ్నీషియం కూడా మలబద్దకం నుండి ఉపశమనం కల్గిస్తుంది.
1. జీర్ణక్రియకు సాయం చేస్తుంది: సమస్యలు లేని జీర్ణక్రియకు వీట్ గ్రాస్ పొడి ఎంతో దోహదపడుతుంది. వీట్ గ్రాస్ పొడిలో ఉన్న కొన్ని ఆల్కలైన్ ఖనిజాలు అల్సర్లు, మలబద్దకం, డయేరియా ల నుండి ఉపశమనం కల్గిస్తాయి. ఎక్కువ మోతాదులో ఉన్న మెగ్నీషియం కూడా మలబద్దకం నుండి ఉపశమనం కల్గిస్తుంది.
2.ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను రూపొందించడం: వీట్ గ్రాస్ పొడిలో అధిక మోతాదులో ఉన్న పత్ర హరితం మన శరీరంలో హిమోగ్లోబిన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పెరిగిన ఉత్పత్తి మన శరీరంలో ఆక్సిజన్ ను పెంచి చేతనత్వాన్ని కల్గిస్తుంది. ఈ విధంగా ఎర్ర, తెల్ల రక్తకణాలు వృద్ది చెందడంలో సాయం చేస్తుంది.
3. బరువు తగ్గడానికి దోహదం చేస్తుంది: వీట్ గ్రాస్ పొడిని జ్యూసులు లేదా స్మూతీలలో కలిపి వాడవచ్చు. దీనిని ఇతర పదార్ధాలు, రుచి కారకాల బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. ఇది శరీరానికి అధిక శక్తిని కలగ చేసి, బలాన్ని పెంచి నందువలన ఎక్కువసేపు వ్యాయామం చేయగల్గినందున బరువు తగ్గుతుంది. అంతేకాక, ఈ పొడి థైరాయిడ్ గ్రంధిని ఉత్తేజపరిచి, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. జీవక్రియను పెంచి స్థూలకాయం, అజీర్తిలను నివారిస్తుంది.
4. పి హెచ్ సంతులనాన్ని పునరుద్ధరిస్తుంది: ఆల్కలైన్ ఆహార అనుబంధం అయినందున, వీట్ గ్రాస్ పొడి శరీర పి హెచ్ ను సంతులనం చేస్తుంది. అందువలన, రక్తంలోని ఆమ్ల గుణాలను తగ్గించి, దాని క్షారస్వభావాన్ని పునరుద్ధరించడంలో సహాయకారిగా ఉంటుంది.
5. శుభ్రపరిచే, నిర్విషీకరణ లక్షణాలు: వీట్ గ్రాస్ పొడిలో అద్భుతమైన నిర్విషీకరణ లక్షణాలు ఉన్నాయి. తాజా కూరగాయలకు సమానమైన దీనిలోని పోషకాలు ఖనిజాలు, యాంటిఆక్సిడెంట్లు, ఎంజైములను కల్గి ఉండటానికి దోహదం చేసి కడుపులో మంటను తగ్గిస్తాయి ఈ రకంగా, ఇది కణాల శక్తిని మెరుగుపరుస్తుంది. రక్తనాళాలను, కాలేయాన్ని నిర్విషీకరణం చేస్తుంది. పెద్దప్రేగు శుభ్రపరిచి, క్యాన్సర్ కారకాల నుండి రక్షణ కల్గిస్తుంది.
6. రక్తహీనతకు సహాయకారి: వీట్ గ్రాస్ లో ఉన్న పత్ర హరిత౦ లోని పరమాణు నిర్మాణం మానవ శరీరంలో ఉన్న హిమోగ్లోబిన్ ను పోలి ఉంటుంది. వీట్ గ్రాస్ పొడిలో ఎక్కువ మోతాదులో ఉన్న పత్ర హరితం ను మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. రక్తం, సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో హిమోగ్లోబిన్ ను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల, రక్తహీనతను నయం చేయడంలో వీట్ గ్రాస్ పొడి సాయం చేస్తుందనే తార్కిక భావన ఖచ్చితమైనదే.
7. క్యాన్సర్ లో సహాయకారి: వీట్ గ్రాస్ లో ఉండే పత్ర హరితం రేడియేషన్ వలన కలిగే హానికారక ప్రభావాలను తగ్గిస్తుంది. ఈ రకంగా, వీట్ గ్రాస్ పొడిని కీమో థెరపీ /రేడియో థెరపీ చికిత్స లో ఉన్న క్యాన్సర్ రోగులకు తరచూ సూచిస్తుంటారు.
8. డయాబెటిస్ కు సహజ చికిత్స: వీట్ గ్రాస్ పొడి డయాబెటిస్ కు ప్రత్యేకంగా సహాయకారి. కారణం ఇది పిండిపదార్ధాల శోషణను ఆలస్యం చేసి రక్తంలో చక్కర మోతాదును నియంత్రించడంలో దోహదపడ్తుంది.ఇలా, ఈ అనుబంధం ప్రాధమిక లేదా అభివృద్ధి చెందిన అధిక డయాబెటిస్ స్థితిని కూడా నియంత్రించ గలదు.
9. పైల్స్ కు చికిత్స: అనేక ప్రయోజనకర పోషకాల కలయిక అయినందున, వీట్ గ్రాస్ పొడిని పైల్స్ (హేమోరాయిడ్లు) కు ఒక సహజ చికిత్సగా ఉపయోగించవచ్చు. ఈ ఘనత పైల్సు కు చాలా సమర్థవంతమైన చికిత్సగా నిరూపించబడిన దీనిలోని పత్రహరితం, పీచు, విటమిన్లు, ఖనిజాలకు దక్కుతుంది. ఈ ప్రయోజనం వలన వీట్ గ్రాస్ పొడిని 3 నెలల వరకు రోజుకు రెండుసార్లు క్రమం తప్పక తీసుకోవలసినదిగా సూచించబడింది.
10.దంతక్షయానికి చికిత్స: వీట్ గ్రాస్ పొడి దంతక్షయాన్ని, ఇతర దంత సమస్యల చికిత్సలో ఎంతో సహాయకారి. చిగుళ్ళను వీట్ గ్రాస్ పొడితో మర్దన చేయడం వలన చిగుళ్ళ సమస్యలను దూరం చేసి, చిగుళ్ళను గట్టిగా, దృఢంగా ఉంచుతుంది.
11. నొప్పులు, కడుపులో మంట నుండి ఉపశమన౦: ఈ అద్భుతమైన అనుబంధం సాధారణమైన కడుపుమంటను తగ్గిస్తుంది, నయం చేస్తుంది. ఇలా, సాధారణ ఒంటి నొప్పుల నుండి ఉపశమనం కల్గించి, అభివృద్ధి చెందేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన శరీర సామర్ధ్యాన్ని పునరుద్ధరిస్తుంది.
12. కళ్ళకు ప్రయోజనకారి: వీట్ గ్రాస్ అనుబంధాలైన వీట్ గ్రాస్ పొడి వంటి వాటి క్రమబద్ధమైన వాడకం వలన ఒక ప్రకాశవంతమైన తెలుపును కళ్ళల్లో పొందేందుకు మీకు వీలు కల్గుతుంది.
13. ఉబ్బిన నరాల నివారణ: క్రమబద్ధ౦గా ఈ అనుబంధాన్ని వాడినందున ఉబ్బిన నరాల వృద్ధిని తగ్గించవచ్చు.
14. రక్తాన్ని శుభ్రపరుస్తుంది: ఒక నిర్విషీకరణ ఏజెంట్ అయినందున, వీట్ గ్రాస్ పొడి మీ రక్తాన్ని శుభ్రం చేసి, మీ శ్వాసలో, చెమటలో చెడు వాసనను పొగొడుతుంది.
15. పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతుంది: ఇది పురుషులు, స్త్రీలలో కూడా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంచుతుంది, పటిమను పెంచుతుంది. గర్భధారణ కు దోహదపడుతుంది.
16. చర్మాన్ని శుద్ధిచేస్తుంది: వీట్ గ్రాస్ పొడి ఒక మంచి చర్మ శుద్దికారి. కారణం ఇది ఉపరితలంపై ఉండే మృత చర్మ కణాలను తొలగించి శుభ్ర పరుస్తుంది. ఇది ఒక అంతర్గత శక్తి యంత్రాంగాన్ని కల్గించి, మన చర్మపు యవ్వన మెరుపును, సాగే గుణాన్ని వృద్ధి చేస్తుంది.
17. మొటిమలకు చికిత్స: వీట్ గ్రాస్ పొడి తన నిర్విషీకరణ ప్రక్రియ ద్వారా మొటిమలు రావడాన్ని తగ్గించి, ఆరోగ్యకరమైన చర్మాన్ని వృద్ది చేస్తుంది. వీట్ గ్రాస్ పొడి, పాలు కలిపిన మిశ్రమాన్ని పూసినట్టైతే మొటిమలు, చిన్న చిన్న మచ్చలు, బ్లాక్, వైట్ హెడ్లు, చర్మం రంగు మారడం వంటి వాటికి ప్రభావవంతమైన చికిత్సను అందిస్తుంది.
18. క్రిమినాశక (యాంటి సెప్టిక్) లక్షణాలు: దీని యాంటి సెప్టిక్ లక్షణాల కారణంగా, వీట్ గ్రాస్ పొడి గాయాలు, పుళ్ళు, పురుగులు కుట్టడం, దద్దుర్లు, తెగడం, కత్తి గాట్లు వంటి వాటికి ఉత్తమ చికిత్సకారి. ఇది విష సారాన్ని తీసి వేసేందుకు కూడా దోహదం చేస్తుంది. అంతేకాక, ఎండకు కమిలిన చర్మానికి, బొబ్బలకు, అథ్లెట్ పాదం వంటి వాటి నుండి ఉపశమనం కల్గిస్తుంది.
19. వృద్ధాప్య నివారణ ప్రయోజనం: వీట్ గ్రాస్ పొడి స్వేచ్ఛా రాశుల ద్వారా కలిగే నష్టం నుండి నిరోధిస్తుంది. దీనిలో ఉన్న సహజ వృద్ధాప్య నివారణ లక్షణాలు కణాలకు శక్తిని ఇచ్చి, వయసు మళ్లే ప్రక్రియను నెమ్మది చేస్తాయి. చర్మం సాగే సమస్యను తగ్గించి, చర్మ స్థితిస్థాపకతను నిర్వహిస్తుంది. ఈ రకంగా మీ చర్మానికి యవ్వనపు మెరుపును పునరుద్ధరిస్తుంది.
20. చుండ్రుకు, జుట్టు సమస్యలకు చికిత్స నిస్తుంది: మీ జుట్టును వీట్ గ్రాస్ పొడితో కడిగినట్టైతే చుండ్రుతో బాటు పొడిబారిన, దురదగా ఉండే తల నుండి సమర్ధవంతమైన చికిత్సను అందిస్తుంది. వీట్ గ్రాస్ పొడిని ఒక సాధారణ షాంపూతో కలిపి మీ జుట్టుకు పట్టించి నట్టైతే, పాడైన జుట్టును సరిచేస్తుంది.
21. తెల్లజుట్టును తగ్గిస్తుంది: వీట్ గ్రాస్ పొడి తెల్లజుట్టును తగ్గించి, తిరిగి దాని సహజమైన రంగును అందించడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. ఈ పొడితో మీ జుట్టును కడగడం వలన జుట్టు తెల్లబడటాన్ని నిరోధించవచ్చు.MANTHENA GROUP
No comments:
Post a Comment