Thursday, June 25, 2015
పాత నోట్ల చలామణి గడువుడి సెంబర్ 31 వరకు పొడిగింపు
పాత నోట్ల చలామణి గడువుడి సెంబర్ 31 వరకు పొడిగింపు2015ముంబై : 2005కు ముందు ముద్రించిన పాత కరెన్సీ నోట్ల చలామణిని రిజర్వు బ్యాంకు ఈ సంవత్సరం డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఇలా గడువు పొడిగించడం ఇది వరసగా మూడో సారి. నిజానికి ఈ నెలాఖరులోగానే ఈ నోట్లు ఉన్న వ్యక్తులు, సంస్థలు వాటిని తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడం లేదా సమీపంలోని బ్యాంకుల శాఖల్లో మార్చుకోవడం చేయాలని ఆర్‌బిఐ ఇంత కు ముందు కోరింది. ఇంతలోనే మళ్లీ ఈ నోట్ల చలామణిని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు తెలిపింది. సరైన భద్రతా అంశాలు లేకపోవడంతో 2005కు ముద్రించిన కరెన్సీ నోట్లను పోలిన దొంగ నోట్లు ఎక్కువగా చలామణిలోకి రావడంతో వీటిని చలామణి నుంచి పూర్తిగా ఉపసంహరించాలని నిర్ణయించిది. 2005 నాటి మహాత్మా గాంధీ సీరిస్‌లో ముద్రించిన రూ.100 నోట్లలో సైతం మరిన్ని భద్రతా అంశాలు జోడించాలని కూడా ఆర్‌బిఐ నిర్ణయించింది.
Labels:
9
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment